Girl killed in Leopard Attack on Tirumala Walkway: తమకు దూరంగా వెళ్లొద్దంటూ తల్లిదండ్రులు చెప్పిన మాటలు.. చిన్నారి లక్షితను పెడచెవిన పెట్టేలా చేశాయి ప్రకృతి అందాలు.. పచ్చిక బయళ్లతో.. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎగురుతూ, దూకుతూ కాలినడక సాగించిన ఆ చిన్నారి...తన ముందు మృత్యువు పొంచి ఉందని ఊహించలేదు. మరి కొన్ని గంటల్లో తల్లిదండ్రులతో కలిసి ఆపదమొక్కులవాడిని దర్శించు కోనుండగా.. చిరుత రూపంలో ఆపద వెంటాడింది. ఉత్సాహంతో తల్లిదండ్రులకు అందనంత దూరంగా అలిపిరి కాలినడక మొట్లపైన పరుగులు తీసిన లక్షిత కన్నవారికి శాశ్వతంగా దూరమైంది.
Bear in Tirumala: తిరుమల కాలినడక మార్గంలో అర్ధరాత్రి ఎలుగుబంటి హల్చల్..
Tirumala Yatra was Tragedy in Dinesh Family: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చిన దినేష్ కుటుంబంలో తిరుమల యాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. తనతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తన ఆరేళ్ల కూతురు లక్షిత.. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో మృత్యువాత పడటంతో గుండెలవిసేలా విలపిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి వచ్చి విగతజీవిగా మారిన కూతురుతో తిరిగి వెళ్లాల్సివచ్చిందని బోరున విలపిస్తున్న లక్షిత తల్లిదండ్రులను ఓదార్చడం బంధుమిత్రులకు కష్టంగా మారింది.
Chirutha Attack on Girl: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి
Complaint to Security Personnel: రాత్రి ఎనిమిది గంటల సమయంలో అలిపిరి నుంచి కాలినడకన బయలు దేరిన దినేష్, శశికళ కుటుంబం రాత్రి పదిన్నర గంటల సమమానికి లక్ష్మినరసింహ స్వామి ఆలయ సమీపానికి చేరింది. అలిపిరి నుంచి తమ కంటే ముందే వేగంగా వెళుతున్న తమ కూతురు లక్షిత.. లక్ష్మినరసింహ స్వామి ఆలయం వద్దకు వచ్చే సరికి కనింపిచకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన దినేష్ దంపతులు.. స్థానికంగా విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు.. ఉదయం ఏడు గంటలకు పాప చనిపోయిందని సమాచారం ఇచ్చారని బాలిక తండ్రి దినేష్ వాపోయారు. లక్షిత మృతదేహానికి తిరుపతి రుయా ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Leopard Trapped: బోనులో చిక్కిన చిరుత.. ఊపిరి పీల్చుకున్న భక్తులు
TTD EO Held an Emergency Meeting With Security Officials: అలిపిరి కాలినడక మార్గంలో జరిగిన విషాధ ఘటనపై తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అటవీ, తితిదే భద్రత అధికారులతో తితిదే ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత భక్తులను అనుమతించే అంశపై సమీక్షిస్తున్నామన్నారు. చిరుత దాడి సంఘటనలు పునరావృతం కాకుండా నడకదారిల్లో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గాలి గోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు నడకమార్గంలో 500 సీసీ కెమరాలను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు నెలల కాల వ్యవధిలో రెండు సార్లు కాలినడక మార్గంలో చిరుత దాడి చేయడం భక్తుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. దేశం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు కాలినడక మార్గాల్లో వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో తితిదే విఫలమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.