ETV Bharat / state

రాత్రివేళ ఆటోలో ఒంటరిగా యువతి.. ముగ్గురు యువకులు వేరే దారికి తీసుకెళ్లి.. - ap latest news

ఓ యువతిపై.. ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆమెను బలవంతంగా వేరే దారిలోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి ప్రయత్నించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

girl fled away from three men who tried to rape her at tirupathi district
యువతిపై అత్యాచారయత్నం.. తప్పించుకున్న బాధితురాలు
author img

By

Published : Jun 27, 2022, 8:05 AM IST

Updated : Jun 27, 2022, 8:25 AM IST

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ యువతిపై.. ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. తిరుపతి నుంచి ఆటోలో ఓ యువతి చంద్రగిరికి బయల్దేరింది. తొండవాడకు చేరుకోగానే.. ఆటోలోని ఇతర ప్రయాణికులు దిగిపోయారు. దీంతో.. యువతి ఒంటరిగా ఆటోలో మిగిలిపోయింది. ఇదే అవకాశంగా భావించిన.. ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు చీకట్లోకి తీసుకెళ్లి దాడి చేసి.. అత్యాచారానికి యత్నించారు.

యువతిపై అత్యాచారయత్నం.. తప్పించుకున్న బాధితురాలు

దుండగుల నుంచి తప్పించుకున్న యువతి.. సమీపంలోని ముక్కోటి శివాలయం వద్దకు చేరుకుంది. ఆలయం వద్ద ఉన్న స్థానికులు ఆ ముగ్గురు దుండగుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆటో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై స్థానిక సీఐ, ఎస్సైకి ఫోన్‌ చేసి సమాచారమిచ్చినా.. వారు స్పందించలేదని స్థానికులు తెలిపారు. తర్వాత యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని యువతిని తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు.

ఇవీ చూడండి: "అమ్మఒడి" కోల్పోయిన తల్లులు.. 51 వేల మంది!

Last Updated : Jun 27, 2022, 8:25 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.