FIRE ACCIDENT AT FOX LINK INDUSTRY : తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఫాక్స్ లింక్ ఎలక్ట్రిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని మొదటి అంతస్థులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన ఫ్యాక్టరీ మొత్తం దట్టమైన పొగ ఏర్పడింది. దీంతో అప్పటివరకూ పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీశారు. డేటా కేబుల్ తయారు చేసే ఫ్యాక్టరీ కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి.
పరిశ్రమ ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించింది అని యాజమాన్యం అంచనా వేస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యుదాఘాతం వల్ల జరిగిందా లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయ అనేది తెలియాల్సి ఉంది.
ప్రాణ నష్టం జరగలేదన్న ఫ్యాక్టరీ యాజమాన్యం: అగ్ని ప్రమాద సమయంలో పరిశ్రమలో దాదాపు మూడు వేల మందికీ పైగా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికి ఫ్యాక్టరీలో నుంచి శబ్ధాలు వస్తున్నట్లు అనధికారిక సమచారం. అగ్ని ప్రమాదంలో ఫాక్స్ లింక్ పరిశ్రమ పూర్తిగా కాలిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది.
ఇవీ చదవండి: