ETV Bharat / state

Devotees protest in Tirumala: 'సేవ్ తిరుమల'... అన్యమతస్థులకు టీటీడీ ఛైర్మన్ పదవెలా ఇస్తారంటూ ఆందోళన

author img

By

Published : Aug 16, 2023, 6:32 PM IST

Devotees protest in Tirumala: తితిదే ఛైర్మన్​గా భూమన కరుణాకరరెడ్డిని నియమించడంపై ఏపీ సాధుపరిషత్‍ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన చేపట్టారు. తితిదే పరిపాలనా భవనం వద్ద సేవ్‍ తిరుమల - సేవ్‍ తితిదే అంటూ ధర్నా నిర్వహించారు. తిరుపతిలో జరుగుతున్న ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో హిందువులే లేరన్నట్లు ఓ క్రిస్టియన్ వ్యక్తిని ఎలా ఛైర్మన్​గా నియమించారని మండిపడ్డారు.

Devotees protest in Tirumala
Devotees protest in Tirumala

Devotees protest appointment of TTD Chairman: తిరుమల తిరుపతి పేరు చెప్పగానే.. ఆ దేవదేవుడిపై భక్తుల్లో విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. అయితే, గత కొన్ని రోజులుగా తిరుమలలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే భక్తులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి. ఇప్పటికే అన్యమత ప్రచారం అంటూ తిరుపతిలో ఇతర మతస్తులకు ఉద్యోగాలు, వసతులు కల్పిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ఎంతో తిరుమల దేవస్థానంలో ఎంతో పవిత్రమైన హోదాగా భావించే తితిదే (Tirumala Tirupati Devasthanam) ఛైర్మన్​ నియామకానికి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమలలో ఓ బాలికను చిరుత హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా మరో మారు తితిదే ఛైర్మన్​పై ఆరోపణలతో తిరుమల పవిత్రతపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ధార్మిక సంఘాలు, భక్తులు తిరుమల ఛైర్మన్​గా భూమన కరుణాకరరెడ్డి నియామకంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన

ఏపీ సాధుపరిషత్‍ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి (Srinivasananda Saraswati) అన్యమతస్ధులను తితిదే ఛైర్మన్‍ గా నియమించారని ఆరోపిస్తూ ఏపీ సాధుపరిషత్‍ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద సేవ్‍ తిరుమల - సేవ్‍ తితిదే అంటూ ధర్నా నిర్వహించారు. భక్తితో, విశ్వాసంతో ఉన్న హిందువులను తితిదే ఛైర్మన్‍ గా నియమించాలని డిమాండ్‍ చేశారు. గతంలో జగన్మోహన్‍ రెడ్డి హయంలో ఎన్నో తప్పులు జరిగాయని ఆరోపించారు. తితిదే ధార్మిక సంస్ధ తితిదేను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం భక్తులకు చేతి కర్రలు ఇస్తామనడం సరైంది కాదన్నారు. తిరుమల చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు జరగలేదని... భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‍ చేశారు.

క్రిస్టియన్ అయిన వ్యక్తికి హందువుల పవిత్ర క్షేత్రమైన తితిదే ఛైర్మన్ (TTD chairman) పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.? తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తన కూతురు పెళ్లి సైతం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని... అలాంటి వ్యక్తిని ఎలా ఛైర్మన్​గా నియమిస్తారంటూ... శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా వేంకటేశ్వర స్వామి భక్తులకు ఇబ్బందులు కలిగే చర్యే అంటూ పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు వేంకటేశ్వర స్వామి ఆదాయం మాత్రమే కావాలన్న ఆయన... భక్తులు పడే సమస్యలతో అవసరం లేదనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత కొంత కాలంగా హిందు దేవాలయాల్లో క్రైస్తవులు, అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమిస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఇలాంటి నియామకాల వల్లే తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'జగన్ ప్రభుత్వంలో అసలు హిందువులే లేరన్నట్లు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తిని ఛైర్మన్​గా నియమించడం దురదృష్టకరం. వన్యప్రాణులు దాడులు చేస్తుంటే.. వన్యమృగాల నుంచి రక్షణ కోసం కట్టెలు ఇస్తామంటున్నారు. కేవలం ఇది తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. రాజకీయాల కోసం మతాన్ని వాడద్దని మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్​గా భూమన కరుణాకరరెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో ఐఏఎస్​ను నియమించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.' - శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధుపరిషత్‍ అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.