Chandrababu : రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా కృషిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెకు వెళ్లారు. అభివృద్ధి అంటే ఒక్కో ఇటుక పేర్చాల్సి ఉంటుందని.. విధ్వంసం మాత్రం పేర్చిన ఇటుకలను కూల్చివేయటం అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే విధంగా కూల్చివేసే పరిస్థితి ఉందని ఆరోపించారు. టీడీపీ చేపట్టిన సంస్కరణల ఫలాలు పేదప్రజలకు అందే సమయంలో.. అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని విధ్వంసం చేస్తోందని విమర్శించారు. అభివృద్ధి చేసి ప్రజల మన్నన పొందాలని కాకుండా.. ప్రతిపక్ష పార్టీలు, నేతలపై ఎదురు దాడులు చేస్తూ పబ్బం గడుపుకోవాలని వైసీపీ చూస్తోందని దుయ్యబట్టారు.
భవిష్యత్తు మీద భరోసా కల్పించేందుకు పోరాడే శక్తిని సంక్రాంతి పండగ ఇస్తుందని అన్నారు. సొంతూళ్లకు వెళ్లి జన్మభూమి రుణం తీర్చుకోవాలన్నారు. చంద్రబాబు సొంతూరికి వెళ్లిన సందర్భంగా ఇలా అన్నారు.
ఇవీ చదవండి: