ETV Bharat / state

'ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తాం'

revolutionary Mahatma Jyoti Rao Phule birthday news: సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పించారు. అనంతరం పూలే సిద్దాంతాలను తమ పార్టీలు పాటిస్తూ.. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

1
1
author img

By

Published : Apr 11, 2023, 12:48 PM IST

Revolutionary Mahatma Jyoti Rao Phule Birth Anniversary: సమాజంలో కుల, మత అనే వివక్షలు లేకుండా ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. కుల వ్యవస్థ నిర్మూలన కోసం, స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఆయన ఎంతగానో పోరాటం చేశారు. అణగారిన వర్గాల కోసం జ్యోతిరావ్ పూలే అహర్నిశలు కృషి చేశారు. సమాజం అంటే సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యం అనే మూడు సూత్రాలతో సమసమాజాన్ని కాంక్షించిన గొప్ప సంఘసంస్కర్త ఆయన. అటువంటి మహనీయుడి జయంతిని పురస్కరించుకుని నేడు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తున్నారు.

బీసీల అభ్యున్నతి కోసం: ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లు సామాజిక మాధ్యమాల వేదికగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. ముందుగా చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ''సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతీరావ్ పూలే. ఆ మహానుభావుడి స్ఫూర్తిగానే తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోంది. పూలే జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళి'' అని ఆయన పేర్కొన్నారు.

  • సమాజంలో కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతీరావ్ పూలే. ఆ మహానుభావుడి స్ఫూర్తిగానే తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోంది. పూలే జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళి. pic.twitter.com/KtSrK4XiK8

    — N Chandrababu Naidu (@ncbn) April 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్త్రీలకు విద్యా అవకాశాలు: అనంతరం పవన్ కల్యాణ్ సైతం మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. ''అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, మహిళల హక్కుల కోసం, వారికి విద్యా అవకాశాలు కల్పించడం కోసం పని చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆ మహనీయుని జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము'' అని ఆయన తెలిపారు.

ఆ మూడింటి కోసమే పూలే పోరాడారు: దేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరాడిన మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ అన్నారు. పూలే జయంతి సందర్భంగా ఆ మార్గదర్శికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం అనే నినాదాన్ని పూలే ఎలుగెత్తి చాటారని.. ఛాందస భావాలు తీవ్రంగా ఉన్న సమయంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఆయన సేవా నిరతి, అణగారిన వర్గాల పట్ల ప్రేమాభిమానాలను ఈ సందర్భంగా మననం చేసుకుందామన్నారు.

  • అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, మహిళల హక్కుల కోసం, వారికి విద్యా అవకాశాలు కల్పించడం కోసం పనిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆ మహనీయుని జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము.#JyotibaPhuleJayanti pic.twitter.com/YoNk7yVgWH

    — JanaSena Party (@JanaSenaParty) April 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జనసేన ఆ సిద్దాంతాన్ని పాటిస్తుంది: ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి.. వారి విద్యాభివృద్ధికి జ్యోతిరావు పూలే శ్రమించారని తెలిపారు. స్వతంత్ర యోధునిగా, కార్మిక నేతగా, రైతు బాంధవునిగా ఆయన జీవితం అజరామరమని అభిప్రాయపడ్డారు. జనసేన సిద్ధాంతాలలో ఒకటైన 'కులాలను కలిపే ఆలోచనా విధానం' పూలే ఆలోచనల నుంచి తీసుకున్నామని.. ఆ మహానీయుని అడుగుజాడలలో జనసేన ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూలు అమ్ముకునే వ్యక్తిగా జీవితం ప్రారంభించి.. రచయితగా ఎదిగి, సంఘ సంస్కర్తగా మారిన విధానం ఆయన దార్శనికతకు, ముందు చూపునకు నిదర్శనంగా అభివర్ణించారు. ఆ మహనీయుని జయంతి సందర్బంగా తన తరపున, జనసేన శ్రేణులు తరపున ఆ చైతన్యమూర్తికి అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.