Case Filed Againest MLA Bhumana Followers: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడన్న నెపంతో అన్నమయ్య జిల్లాకు చెందిన పత్తిమణి అనే వ్యక్తిని.. భూమన అనుచరులు చితకబాది.. కిడ్నాప్ చేసిన వార్త ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు మన్నూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులపై కిడ్నాప్, దాడి, అసభ్యకరంగా మాట్లాడటం వంటి వాటిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగానే పోలీసులు.. ఈ ఘటనపై నామమాత్రపు కేసు నమోదు చేసి.. వెంటనే వదిలిపెట్టినట్లు స్థానికంగా వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై మాట్లాడేందుకు పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత రాత్రి బాధితుడికి చిట్వేలు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం.. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన బాధితుడు.. ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకున్నట్లు సమాచారం. బాధితుని బంధువులు కూడా జరిగిన విషయంపై మాట్లాడటానికి నిరాకరించటం పలు అనుమానాలకు తావిస్తోంది. పత్తిమణిపై జరిగిన దాడి ఘటనలో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
పింఛన్ అడిగినందుకు.. పేద మహిళపై వైసీపీ దౌర్జన్యం
పల్నాడు జిల్లాలో యువకుడిపై గొడ్డలితో దాడి..
మరోవైపు పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణం నాగిరెడ్డిపల్లెలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. యువకుడిని చికిత్స మేరకు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
Volunteer attack on Old Woman: వృద్ధురాలిపై దాడి.. ఉత్తమ వాలంటీర్ నిర్వాకం
ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 17 గుడిసెలు దగ్ధం..
ప్రకాశం జిల్లా అర్ధవీడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చెంచు తెగకు చెందిన 17 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే మంటలు వ్యాపించి పూరి గుడిసెలన్నీ కాలిపోయాయి.
ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. చెంచులు 10 సంవత్సరాల నుంచి పూరి గుడిసెలలో జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూరి గుడిసెలు కాలిపోవడంతో చెంచు తెగకు చెందిన బాధతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
RAILWAY BOGI FIRE: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం