ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ - తిరుపతి జిల్లా తాజా వార్తలు

Kangana: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.

kangana ranaut visited tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్
author img

By

Published : May 16, 2022, 10:19 AM IST

Kangana: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. తన లేటెస్ట్ మూవీ "ధాకడ్"​ విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నట్లు కంగనా తెలిపారు. కంగనా నటించిన "ధాకడ్" సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు : తిరుమలలో నిన్న శ్రీవారిని 81,720 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,266 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. స్వామి వారి సర్వదర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.