BABU RAJENDRA PRASAD : చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు, విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా.. కేంద్రం ఇచ్చిన నిధులను దొంగలించిందని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన సర్పంచ్ నిధులు 8660 కోట్ల రూపాయలను వెంటనే గ్రామ పంచాయతీలలో తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల మాదిరిగానే గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు.
పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకం నిధులను గ్రామ పంచాయితీలకు అప్ప చెప్పి సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామ సభల నిర్ణయం మేరకు పనులను నిర్వహించాలన్నారు. సర్పంచులు, యంపీటీసీలకు 15 వేలు, ఎంపీపీ, జెడ్పీటీసీలకు 30 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ 12 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అమోదించకపోతే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.
ఇవీ చదవండి: