ETV Bharat / state

Atrocities Under Influence of Alcohol: మద్యం మత్తులో అరాచకాలు.. ఒకరు హత్య.. మరొకరు ఆత్మహత్య - కర్నూలు జిల్లా లేటెస్ట్ న్యూస్

Atrocities Under Influence of Alcohol: చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మద్యం మత్తులో చిక్కుకుని చాలామంది ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో హత్యకు పాల్పడితే.. మరో యువకుడు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.

Murder under the influence of alcohol
మద్యం మత్తులో హత్య
author img

By

Published : Jun 19, 2023, 5:28 PM IST

Updated : Jun 19, 2023, 7:45 PM IST

Atrocities Under Influence of Alcohol: ఇటీవల కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలామంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోతున్నాయి. ఎంతోమంది దంపతులు, అన్నదమ్ముల మధ్య కలహాలు చోటు చేసుకుని.. విడిపోయిన పరిస్థితులు కూడా చాలానే చూశాం. మద్యం మత్తులో ఇటీవల కాలంలో ఎన్నో యాక్సిడెంట్స్ కూడా సంభవించాయి. దీంతోపాటు మద్యం మత్తులో హత్యలకు, అత్యాచారాలకు, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మద్యం మత్తులో పడిన వ్యక్తులు సృష్టించిన అరాచకాలెన్నో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనలే తిరుపతి, కర్నూలు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తి హత్య చేస్తే.. మరో వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.

Petrol Attack on Couple: దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు

తిరుపతి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తొట్టంబేడు మండలంలోని రౌతు సూరమాలలో ఎస్టీ కాలనీకి చెందిన చెంచయ్య, అతడి భార్యకు మధ్య వివాదం నెలకొంది. దీంతో వారిని సర్దిచెప్పేందుకు వారి బంధువైన చింతయ్య(33) అనే వ్యక్తి మధ్యవర్తిగా వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురికి సర్ది చెప్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న చెంచయ్య.. రోకలిబండతో చింతయ్య తలపై కొట్టాడు. దీంతో చింతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడి నుంచి చెంచయ్య పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే తొట్టంబేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

'ముసలాడే కానీ.. మహానుభావుడు'.. మద్యం కోసం ఏకంగా మనవడి కిడ్నాప్

మరోవైపు.. కర్నూలు జిల్లాలో మద్యానికి బానిసైన ఓ యువకుడు హంద్రీనదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలులోని బుధవారపేటకు చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మీ దంపతుల కుమారుడు గజేంద్ర(20) మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం తాగేందుకు రోజూ తన తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కూడా కల్లు తాగేందుకు డబ్బులు ఇవ్వమని పట్టుబట్టాడు. అయితే అతడి తల్లి మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో ఆ యువకుడు చనిపోతానంటూ.. బయటకు వెళ్లి కాలనీ సమీపంలోని హంద్రీనది వంతెనపైకి వెళ్లి దూకాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని నదిలో నుంచి బయటకు తీసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మద్యం కోసం తండ్రి దారుణ హత్య.. బాలుడిపై సైకాలజిస్ట్​ వేధింపులు.. ఏడేళ్ల పాటు..!!

Last Updated : Jun 19, 2023, 7:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.