ETV Bharat / state

'వివేకా హత్యలో ప్రమేయం లేదని.. శ్రీవారి ఎదుట ప్రమాణానికి జగన్​ సిద్ధమా' - నారా లోకేశ్​

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్రలో ఆయన ముఖ్యమంత్రి జగన్​పై ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్​ సీఎం అయిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని పేదవారికి దూరం చేశారని దుయ్యబట్టారు.

Nara Lokesh
నారా లోకేశ్​
author img

By

Published : Feb 27, 2023, 10:36 PM IST

తిరుపతి జిల్లాలో 29వ రోజు నారా లోకేశ్​ పాదయాత్ర

Nara Lokesh Yuvagalam : యువగళం దెబ్బతో ఇన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన సీఎం జగన్‌.. ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. రాయలసీమ బిడ్డనంటూ ఎన్నికల ముందు మభ్యపెట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీమను నాశనం చేశారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో ప్రమేయం లేదని సీఎం జగన్‌.. శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయగలరా అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

తిరుపతి జిల్లాలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 29వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలోని శివగిరి నుంచి పాదయాత్ర లోకేశ్​ పాదయాత్రను ప్రారంభించారు. స్థానికులు ఎదురేగి స్వాగతం పలికారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. అనంతరం లోకేశ్‌ తొండవాడ సభలో పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, రోజా, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఈ సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నలుగురు నేతలు శ్రీవారి టిక్కెట్లు, భూములు కొల్లగొడుతున్నారని లోకేశ్‌ ఆరోపించారు. ఇసుక, మద్యం అక్రమాలతో కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. జగన్‌ సీఎం అయిన తర్వాత వెంకటేశ్వరస్వామిని పేదవారికి దూరం చేశారని అన్నారు. ఈ నాలుగేళ్లలో జగన్‌ రాయలసీమకు చేసిన మేలు ఏమిటో.. సీమవాసులు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు.

"ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి రెండు సార్లు శంకుస్థాపన చేశారు. అందులో మొదటిసారి శంకుస్థాపన చేసినపుడు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. కానీ, రెండోసారి ఆ ఉద్యోగాలను 6 వేలకు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం అపార తుంగభద్ర కట్టాటానికి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రకటించింది. యుద్ధ ప్రతిపాదికన ఆ డ్యామ్​ కడుతున్నారు. రాయలసీమకు చెందిన ఒక్క ఎంపీ మన హక్కుల గురించి మాట్లాడటం లేదు. పక్కనున్న అమరరాజా బ్యాటరీస్​ను.. చీ మాకొద్దని వాళ్లని పంపించేశారు." -నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

పింక్‌ డైమెండ్‌ పేరుతో నీతిమాలిన రాజకీయాలు చేసిన జగన్‌.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని లోకేశ్‌ ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం లేదని.. శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఆ తర్వాత బీసీ నేతలతో లోకేశ్‌ భేటీ అయ్యారు. జగన్‌ పాలనలో దగాపడ్డ బలహీనవర్గాలకు తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని.. నిధులు విడుదల చేసి బీసీ ఉపకులాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలను రాజకీయంగానూ ప్రోత్సహిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.