శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది చోటుచేసుకున్న కేసులుపై ఎస్పీ అమిత్ బర్దార్ వార్షిక నేర సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసుల వివరాలను వివరించారు. జిల్లాలో ఈ ఏడాది తొమ్మిది వేల ఇరవై కేసులు నమోదు అయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే 975 కేసులు పెరిగాయన్నారు. మహిళలపై నాలుగు వందల రెండు కేసులు నమోదు కాగా.. పిల్లలపై 64 కేసులు నమోదు అయ్యాయన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు 794 నమోదు కాగా.. 277 మంది చనిపోయినట్లు ఎస్పీ చెప్పారు. గంజాయి, గుట్కా కేసులతో పాటు నాటుసారా కేసులు కూడా నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్న ఎస్పీ అమిత్ బర్దార్.. విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా శాంతి భద్రతలను కాపాడేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ఆంక్షలను అందరూ పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: