ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో అలజడి... అభ్యర్థుల నుంచి నామపత్రాలు లాక్కెళ్లిన వైనం

శ్రీకాకుళం జిల్లాలో అధికార వైకాపా అరాచకాలు కొనసాగుతున్నాయి. నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థుల నుంచి నామపత్రాలను లాక్కుని భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి, ఎలాంటి అలజడులు లేకుండా అభ్యర్థులు నామినేషన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Ycp leaders took nomination papers from candidates in srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో అలజడి... అభ్యర్థుల నుంచి నామపత్రాలు లాక్కెళ్లిన వైనం
author img

By

Published : Jan 31, 2021, 4:38 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని హనుమంతునాయుడుపేట సచివాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో... నామినేషన్ వేసేందుకు వచ్చిన వారి నామపత్రాలను వైకాపా వర్గీయులు తీసువెళ్లారు. హనుమంతునాయుడుపేట సర్పంచ్ స్థానానికి తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి గౌతమిని అడ్డుకున్నారు. ఆమె కుల, ఆదాయ ధ్రువపత్రాలను వైకాపా కార్యకర్తలు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు... వీడియో కాల్ ద్వారా బాధితురాలితో మాట్లాడి, నామినేషన్ వేసేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఆకాశలక్కవరం సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడానికి వచ్చిన అప్పలకొండ నామప్రతాలను వైకాపా శ్రేణులు తీసుకువెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు... నామినేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో అలజడి... అభ్యర్థుల నుంచి నామపత్రాలు లాక్కెళ్లిన వైనం

ఇదీచదవండి.

'రామతీర్థం ఆలయాన్ని తితిదే పరిధిలోకి తీసుకురావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.