ETV Bharat / state

YCP COMMENTS ON PADAYATRA: రైతుల ఉద్యమం వెనక చంద్రబాబు పాత్ర: ధర్మాన కృష్ణదాస్

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర(ycp leaders comments on amaravathi padayatra)పై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రైతుల ఉద్యమం వెనక తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు.

ycp comments on maha padayatra
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్
author img

By

Published : Nov 15, 2021, 7:21 PM IST

అమరావతి రైతుల ఉద్యమం వెనక తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(Deputy cm Dharmana Krishnadas comments on maha padayatra) ఆరోపించారు. చంద్రబాబు తెరచాటు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మబగాంలోని ఆయన నివాసంలో నిర్వహించిన సమావేశంలో అమరావతి రైతుల ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ పాలనకు కట్టుబడి ఉందని తెలిపారు. అమరావతి రాజధాని పేరిట గత ప్రభుత్వం దందా సాగించిందన్నారు. తమ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని(ycp leaders comments on amaravathi padayatra) స్పష్టం చేశారు.

రైతుల పాదయాత్ర కాదు.. తెదేపా నాయకుల రియల్ ఎస్టేట్ యాత్ర: ఎమ్మెల్యే రాజన్నదొర

అమరావతి రైతుల పాదయాత్ర కాదు.. తెదేపా నాయకుల రియల్ ఎస్టేట్ యాత్ర అని వైకాపా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర(ycp mla pidika rajanna dora comments on amaravathi padayatra) ఆరోపించారు. ఈ యాత్ర తెదేపా డైరెక్షన్​లో జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. శివరామన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం వికేంద్రీకరణ అవసరమని.. ఆ మేరకే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర నాయకులు వెళ్లి వాళ్లని ముష్టి అడుక్కోవాలా అన్న రాజన్న దొర.. దీనిపై ఉత్తరాంధ్ర తెలుగుదేశం నాయకులు ఆత్మవంచన చేసుకోవాలన్నారు. స్థానిక తెదేపా నాయకులను విద్యార్థి సంఘాలు, యువత నిలదీయాలన్నారు.

ఇదీ చదవండి..: amaravathi padayathra start: 15వ రోజు.. సమరోత్సాహంతో అమరావతి పాదయాత్ర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.