శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం పెద్ద సిర్లాం గ్రామంలో వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
గాయపడిన వారిని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతర్గత కలహాలే కొట్లాటకు కారణమని పోలీసులు తెలిపారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి : అధికారులకు అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్..!