ETV Bharat / state

సభాపతి వెళ్లిపోయాక.. చితక్కొట్టుకున్న వైకాపా నాయకులు! - speaker tammineni seetha ram news

శాసన సభాపతి హాజరైన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకులు బాహాబాహీకి దిగారు. ఆయన వెళ్లిపోయిన తరువాత చొక్కాలు చిరిగేలా తలపడ్డారు.

YCP leaders fight
YCP leaders fight
author img

By

Published : Jul 11, 2020, 3:11 PM IST

వైకాపా నాయకుల ఘర్షణ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్ననపేటలో... వైకాపా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేసి వెళ్లిపోయిన అనంతరం పార్టీలోని ఇరు వర్గాల నాయకులూ దుస్తులు చిరిగేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

అక్కడే ఉన్న పార్టీ పెద్దలు.. వారికి నచ్చజెప్పగా వివాదం సద్దుమణిగింది. సొంతపార్టీలో ఉన్నవాళ్లే ఇలా దాడి చేసుకోవడం ఏంటంటూ.. పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. పాత కక్షలు మనసులో పెట్టుకొనే వీధి పోరాటానికి దిగినట్లు నాయకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

కారు దింపిన తర్వాత విజయసాయి ఒత్తిడికి గురయ్యారు: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.