ETV Bharat / state

భూవివాదం.. 'మంత్రి అండదండలతోనే నాపై దాడి' - YCP leaders attack on woman

Attack on Woman: మంత్రి అండదండలతో 50 మంది తనపై దాడి చేశారని శ్రీకాకుళం జిల్లా మందస మండలం పందిరూరుకు చెందిన పందిరి నిర్మల అనే మహిళ ఆరోపించింది. భూమి విషయంలో తలెత్తిన వివాదాల కారణంగానే తనపై దాడి చేసినట్టు బాధిత మహిళ పేర్కొంది.

woman
బాధిత మహిళ
author img

By

Published : Dec 20, 2022, 8:54 PM IST

Attack on Woman: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పందిరూరుకు చెందిన పందిరి నిర్మల అనే మహిళపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తులకు మంత్రి అప్పలరాజు అండదండలు ఉన్నాయని.. మొత్తం 50 మంది వచ్చి దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. భర్తతో తరచూ గొడవలు కారణంగా.. 2020లో పెద్ద మనుషుల సమక్షంలో భర్త దుర్గాప్రసాద్​తో విడిపోయింది. భర్తకు ఇళ్లు కట్టివ్వాలని పెద్ద మనుషులు చెప్పడంతో.. ఇళ్లు కూడా కట్టించాను అని తెలిపింది. ఇళ్లు కడుతున్న సమయంలో తనకు ఇచ్చిన కొంత భూమిని భర్త దుర్గాప్రసాద్ అమ్మేశారని తెలిపారు. మిగతా భూములు అమ్మకుండా కోర్టులో కేసు వేశానని అప్పటినుంచి దాడులు చేస్తున్నారని ఆరోపించింది. భూములు కొన్న వ్యక్తులకు మంత్రి అప్పలరాజు అండదండలు ఉన్నాయని బాధితురాలు చెప్పింది. ఆమె ప్రస్తుతం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.