లాక్డౌన్తో పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పక్కదారి పడుతోంది. రూ 1000 నగదు పంపిణీని అధికార పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఈ నగదును వాలంటీర్లు పంపిణీ చేయాల్సి ఉండగా వైకాపా నాయకులు సైతం లబ్ధిదారులకు నగదు పంపిణీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శనివారం ఉదయం ఈ తతంగం నడిచింది. ఇటీవల వాయిదాపడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ పంపిణీలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న నగర పంచాయతీ కమిషనర్ వాలంటీర్లను హెచ్చరించారు. అనంతరం వైకాపా నాయకులు మెల్లగా జారుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా కాటుకు మరో ఇద్దరు బలి!