ETV Bharat / state

'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' హుద్​హుద్​ బాధితుల ఇళ్లను గాలికొదిలిన వైసీపీ సర్కారు - Srikakulam District News

YCP Government Neglect of Hudhud Cyclone Victims : 2014 లో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ విధ్వంసానికి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి చాలామంది పేదలు నిరాశ్రయులయ్యారు. లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు అప్పగించే సమయంలో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయలేదు. దీంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ఘటనలో కొన్ని ఏళ్లుగా నిర్మిస్తున్న బాలుర ఆశ్రమ వసతిగృహం నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాఠశాలనే వసతిగృహం చేసుకొని పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు.

YCP_Government_Neglect_of_Hudhud_Cyclone_Victims

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 12:42 PM IST

'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' హుద్​హుద్​ బాధితుల ఇళ్లను గాలికొదిలిన వైసీపీ సర్కారు

YCP Government Neglect of Hudhud Cyclone Victims : హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం నిర్మించిన ఇళ్లు శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరుపయోగంగా పడిఉన్నాయి. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఇల్లు కోల్పోయిన వారికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ. 9 కోట్ల వ్యయంతో 192 ఇళ్లు నిర్మించింది. లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు అప్పగించే సమయంలో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణి చేయలేదు.

"హుద్‌హుద్‌" పీడకలకు తొమ్మిదేళ్లు.. చంద్రబాబును గుర్తు చేసుకుంటున్న ఉత్తరాంధ్ర ప్రజలు

Situation of Hudhud Cyclone Victims : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు దట్టంగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఎవ్వరి పర్యవేక్షణ లేకపోవడంతో మందుబాబుల వికృతి చేష్టలు మితిమీరిపోయి ఇళ్లు అధ్వానంగా తయారయ్యాయి. పేదల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Condition of Tribal Boys Ashram School Students : జిల్లాలోని మరో ఘటనలో, పేద గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ సదుపాయాలతో విద్యను చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గ్రహణం పట్టింది. సరైన మౌలిక వసతులు లేక శ్రీకాకుళం జిల్లా టెక్కలి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఏళ్లుగా నిర్మిస్తోన్న వసతిగృహం నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాఠశాలనే వసతిగృహంగా నిర్వహిస్తున్నారు. ఒకే గదిలో తరగతులు నిర్వహణ, తినడం, పడుకోవడం, ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిధులు వచ్చేదెప్పుడు.. సమస్యలు తీరేదెప్పుడు..?

Problems of Ashram Students : గత ప్రభుత్వ హయాం 2019 సంవత్సరం లో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టెక్కలి పట్టణంలో టిఎస్​పి, ఈఐ, నిధులతో అప్పటి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రూ. 8.75 కోట్ల నిధులతో పాఠశాల భవనాలతో పాటు డార్మెటరీ మరుగుదొడ్లు నీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకు రక్షణ పనులను ప్రారంభించారు.

ఎన్నికల నాటికి రూ. 3.57 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా గుత్తేదారులకు రూ. 1.50 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన నిధులు గుత్తేదారులకు చెల్లించకపోవడంతో పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. అప్పటి నుంచి ఏళ్లు గడుస్తున్నా వసతి గృహం, పాఠశాల పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

Condition of Tribal Students in Srikakulam : ప్రస్తుతం పాఠశాలలోనే వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. టెక్కలి, మోలియాపుట్టి, పాతపట్నం మండలాల్లో అనేక గిరిజన గ్రామాల నుం ఎంతోమంది పేద విద్యార్థులు ఈ గిరిజన పాఠశాలలో చదువుతున్నారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు 155 మంది విద్యార్థులు ఈ పాఠశాలలోనే చదువును అభ్యసిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులకు కేవలం ఎనిమిది గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు గదులు పూర్తిగా శిథిలమయ్యాయి. అన్ని ఒకే గదిలోనే నిర్వహిస్తు పగటిపూట చదువు, రాత్రిపూట బెంచీలు బయటపెట్టి నేలపై నిద్రిస్తూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Students Problems: చిన్నారులకు ఎన్ని కష్టాలో.. చదువు కోసం ప్రాణాలతో చెలగాటం

ఒక చిన్న గదిలో 30 మంది వరకు విద్యార్థులు ఉండాల్సి వస్తుందని విద్యార్ధులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం, చలికాలంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అంతమంది విద్యార్థులు ఒకే గదిలో పడుకోవడం వలన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అర్ధాంతరంగా నిలిచిన పనులు పూర్తి చేసి వసతి గ్రహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.