ETV Bharat / state

మోసం చేసిన భర్త..కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్​కు లాక్కెళ్లిన భార్య - mandhalapet viral video

ఉపాధి కోసం వేరే ఊరు వెళ్లిన భర్త మరో మహిళను ఊరుకు తీసుకువచ్చాడు... ఈ విషయంపై భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించింది. సమస్య కొలిక్కి రాకపోవటంతో.. ఆ భర్త అక్కడనుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ఆ భార్య... అతడి కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

wife grabs husband
షణ్ముకరావును లాక్కొని తీసుకువెళ్తున్న పార్వతి
author img

By

Published : Sep 18, 2020, 8:32 PM IST

షణ్ముకరావును లాక్కొని తీసుకువెళ్తున్న పార్వతి

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం మంచాలపేటకు చెందిన షణ్ముకరావును.. ఆయన భార్య పార్వతి నడిరోడ్డు మీద కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్​కి లాక్కెళ్లడం చర్చనీయాంశమైంది. వీరికి ఇద్దరు పిల్లలుండగా.. కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్​ వెళ్లిన షణ్ముకరావు.. మరో మహిళను తీసుకువచ్చాడు. పైగా ఆమె గర్భవతి కావటంతో ఈ విషయాన్ని పార్వతి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. సమస్య అక్కడ పరిష్కారం కాకపోవటంతో షణ్ముకరావు అక్కడనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పార్వతి.. గ్రామస్థుల సహకారంతో భర్త కాలర్ పట్టుకొని.. నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీసు స్టేషన్​కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది.

ఇదీ చదవండి: తాగి విధులకు వీఆర్వో హాజరు... మహిళా ఉద్యోగిపై అసభ్యప్రవర్తన...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.