ETV Bharat / state

కరోనాతో భర్త మృతి..గంటల వ్యవధిలోనే భార్య మృతి - couple was died in Suravaram village

కడవరకు ఒకరికొకరు తోడుగా నిలుస్తామని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు ఆ దంపతులు. చేసిన ఆ బాసలను నిజం చేస్తూ మరణంలోనూ ఒక్కటయ్యారు. కరోనాతో భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే ఆయన సతీమణి మరణించింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సురవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

couple died
దంపతులు మృతి
author img

By

Published : May 30, 2021, 5:56 PM IST

అన్యోన్యంగా జీవించిన ఆ దంపతులు మృతువులోనూ ఒక్కటయ్యారు. గంటల వ్యవధిలో భార్యభర్తలిద్దరూ మరణించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సురవరం గ్రామంలో గంటా సీతారాం 30 ఏళ్లు రేషన్ డీలర్​గా పని చేశారు. కొద్ది రోజులుగా దంపతులిద్దరికీ అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో భర్త సీతారాం మృతి చెందగా.. కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన భార్య జయమ్మ కూడా మృతి చెందింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. మరణంలోనూ వారి బంధం విడదీయలేనిదని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.