ETV Bharat / state

Electricity bills రూ. 40, రూ. 20, 19వేలు... ఓ గ్రామంలో పేదల ఇంటి విద్యుత్ బిల్లులు..!

electricity bills in Srikakulam: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మలగాం గ్రామంలో విద్యుత్ బిల్లులు గ్రాస్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రెండు మూడొందలు రావాల్సిన బిల్లులు ఏకంగా... రూ. 40, రూ. 20 రూ.16 వేలు... వేలల్లో రావడంతో గ్రాస్థులు బెంబేలెత్తుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

electricity bills
electricity bills
author img

By

Published : Jun 9, 2023, 10:29 PM IST

electricity bills in Malagam village: అది ఓ మారుమూల గ్రామం. ప్రతి నెల వారికి విద్యుత్ వినియోగిస్తే వచ్చే బిల్లు రూ. 200 లేదా 300 వందలు. అయితే, ఈ సారి మాత్రం ఆ గ్రామంలోని పలువురు విద్యుత్ వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని సముద్ర తీర ప్రాంత గ్రామమైన మలగాంలో ఏకంగా రూ. 40వేలు, రూ. 20వేలు, రూ. 19వేలు... విద్యుత్ బిల్లు వచ్చింది. పూరి గుడిసెలు, రెకుల షెడ్ల్​, డాబాల్లో... ఇళ్లకు ఇలా వేలల్లో విద్యుత్ బిల్లులు రావడంతో ఆ గ్రామంలోని పేదలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిన ప్రతి ఇంట్లో సగటున రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ మాత్రమే వినియోగిస్తున్నామని గ్రామస్థులు పేర్కొెంటున్నారు. అయినా మాములుగా వందల్లో రావాల్సిన బిల్లులు రూ. వేలల్లో రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతుంటామని పేర్కొంటున్నారు. అయితే, ఒక్కసారిగా ఇంతలా బిల్లులు రావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమో లేక, ప్రభుత్వం నిర్లక్షమో గాని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇంతలా బిల్లులు చెల్లించేందుకు తమకు స్థోమత లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధిరులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యుత్ బిల్లు బాధితుల వివరాలు: పూరి గుడిసెల్లో నివసి స్తున్న కుటుంబానికి రూ.20 వేలు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. డాబా రేకుల ఇళ్లలో ఉన్నవారికి రూ.40 వేలు వరకు ఈనెల బిల్లులు వేశారు. గ్రామానికి చెందిన కర్రి కృష్ణారా వుకు రూ.40,187, కర్రి బాబుకు రూ. 19,440, కర్రి గంగులుకు రూ.14,568, ఇప్పిలి తవిటమ్మకు రూ.16,750, లండ శాంతమ్మకు రూ. 21,882, బుచ్చ. చిన్న మ్మకు రూ.6 వేలు, వడ్డి గురుమూర్తికి రూ.13,174, నౌపడ అప్పమ్మకు రూ. 16,973, వడ్డి రాములు, లండ తులసమ్మకు రూ.5 వేల చొప్పున విద్యుత్తు
బిల్లులు వచ్చాయి.

ఇదే అంశంపై లైన్ మెన్​ను ప్రశ్నస్తే డబ్బులు కట్టాల్సిందే అంటున్నాడని గ్రామస్థులు వాపోయారు. బిల్లులపై సంతబొమ్మాలిలోని విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా వాళ్లు సైతం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కొత్త మీటర్లకు డీడీలు తీసుకొమ్మంటున్నారని పేర్కొన్నారు. పెద్ద పెద్ద రైస్ మిల్లులకు వచ్చినట్లుగా ఇంతలా బిల్లులు వస్తే మీము ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. వచ్చిన బిల్లులో సగం బిల్లుల్ని కట్టాల్సిందేనని అధికారులు డిమాండ్ చేస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. అంత బిల్లులు కట్టే స్తోమత తమకు లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

వేలల్లో విద్యుత్ బిల్లులు రావడంతో మలగం గ్రామస్థుల ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.