ETV Bharat / state

'చెత్తపని'పై సీఎం క్షమాపణ చెప్పాలి: విష్ణుకుమార్​రాజు

దేశ రాజకీయ చరిత్రలోనే అత్యధిక ప్రజామోదాన్ని పొందిన ప్రధాని, భారతరత్న వాజ్​పేయీ అని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్​రాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వాజ్​పేయీ చిత్రపటానికి పూలమాల వేశారు. నూతన వ్యవసాయచట్టాలతో రైతులకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని విఘ్ణుకుమార్​రాజు అన్నారు.

vajpayee-jayanthi-celebrated-at-srikakulam-district-bjp-office
ఘనంగా వాజ్​పేయీ జయంతి
author img

By

Published : Dec 26, 2020, 9:41 AM IST

వైకాపా ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలు చెత్త బుట్టల్లో వేస్తారని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా భాజపా కార్యాలయంలో విష్ణుకుమార్‌రాజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. జాతీయ బ్యాంకుల వద్ద శుక్రవారం చెత్త వెయ్యడాన్ని.. అద్భుతమైన కార్యక్రమంగా వైకాపా సర్కారు పేర్కొంటుందని.... ఈ సంఘటనను భాజపా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న భాజాపా మాజీ ఎమ్మెల్యే.. మంత్రులకు కూడా స్వతంత్రం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప.. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేవి కాదన్నారు. మరో సంవత్సరం పోతే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు.

ఇదీ చదవండి: 'సీఎం జగన్ కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.