శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లొద్దపుట్టి పంచాయితీ జగన్నాథపురానికి చెందిన ఆసి జయ (28), కవిటి మండలం శాసన పుట్టుకకు చెందిన గౌరమ్మ (50) పిడుగుపాటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు.
జయతో పాటు మరో ముగ్గురు మాశాఖపురంలో పెళ్లి సంబంధం చూసి ద్విచక్ర వాహనంపై తిరిగి పయనమయ్యారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. వానలో తడవకుండా వీరు చెట్టు కింద నిలబడ్డారు. అదే సమయంలో పిడుగుపడటంతో జయ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తలకు గాయం కావడంతో.. మెరుగైన చికిత్స కోసం ఒడిశాలోని బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అసోం మాజీ సీఎం బర్మన్ కన్నుమూత
వ్యవసాయ పొలంలో జీడిపిక్కలు తీసేందుకు.. కవిటి మండలానికి చెందిన గౌరమ్మ తోటకి వెళ్లింది. ఆ సమయంలో గౌరమ్మపై పిడుగు పడింది. చుట్టుపక్కల ఉన్న రైతులు గమనించి స్థానికులకు సమాచారం అందించారు. వెంటనే సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: