శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కాజీపేటలో ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల విషయంలో ఘర్షణ చోటు చేసుకుందని గ్రామస్థులు తెలిపారు. ఓట్ల విషయమై మాటామాటా పెరిగి ఘర్షణకు దారీ తీసిందని చెప్పారు. ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయని.. ఈ సందర్భంగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొందని ప్రజలు వెల్లడించారు.
ఈ ఘర్షణలో పలువురి ఇళ్లు దెబ్బతిన్నాయి. శాసనసభాపతి తమ్మినేని సీతారాం తనయుడు వెంకట చిరంజీవి కాజీపేటకు వెళ్లి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: