శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం రొంపవలస, రోమదల గ్రామాల్లో కంటైన్మెంట్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ ఎం.కాళీ ప్రసాద్ తెలిపారు. గురువారం ఈ రెండు గ్రామాల్లో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా జిల్లా కలెక్టర్ నివాస్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. రెండు గ్రామాల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎస్ఐ టి.రాజేష్ పర్యవేక్షణలో రాకపోకలు నిలిపి వేసినట్లు తెలియజేశారు.
ఇవీ చూడండి...