ETV Bharat / state

హంతకురాలిని పట్టించిన కర్టెన్- వంద కి.మీ దూరంలో పడేసినా ఇలా దొరికేసింది! - MADAKASIRA POLICE SOLVE MURDER CASE

వివాహేతర సంబంధం పెట్టుకుని కొడుకు సాయంతో భర్తను హత్య చేసిన భార్య - డెడ్ బాడీ ఏపీకి పార్శిల్

Madakasira Police Solved Karnataka Murder Case
Madakasira Police Solved Karnataka Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 6:51 PM IST

Updated : Nov 10, 2024, 7:38 PM IST

Madakasira Police Solved Karnataka Murder Case : వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను కుమారుడు, ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ భార్య. ఆ హత్యను కప్పిపుచ్చేందుకు వారు నివాసం ఉంటున్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి తీసుకువచ్చి ఓ కాలువలో పడేసి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. కానీ శవానికి ఉన్న డోర్ కర్టెన్ ద్వారా వారి పన్నాగం బట్టబయలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే,

Wife Murder Husband : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కోడిగానిపల్లి వద్ద గత సంవత్సరం ఓ గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ కేసును చేధించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు శవానికి చుట్టిన డోర్ కర్టెన్ ద్వారా కేసును చేధించారు. పట్టుబడ్డ నిందితుల గృహానికి ఉన్న డోర్ కర్టెన్ ఒకేలా ఉండటంతో పోలీసులు కూపీ లాగగా నిజ నిజాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

ముగ్గురి దారుణ హత్య - భయంతో తలుపులు పెట్టుకున్న గ్రామస్థులు - పోలీసులు వెళ్లేవరకూ ఇళ్లలోనే

మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మోహన్ కుమార్ తెలిసింది. తుంకూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మోహన్ కుమార్, అతని భార్య కవితకు సంసార విషయంలో ఇద్దరికి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో కవిత తన కొడుకు, కుమార్తెను తీసుకొని ఇల్లు వదిలి అదే ప్రాంతంలో వేరే చోట నివాసం ఏర్పరచుకొని హోటల్ వ్యాపారం చేస్తూ జీవితం గడుపుతోంది. ఇదే సమయంలో కవితకు విద్యుత్ శాఖలో జేఈగా పని చేసే పాష అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధం మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త మోహన్ కుమార్ కవితతో అనేక మార్లు గొడవకు దిగాడు.

విసుగు చెందిన కవిత, ఆమె కుమారుడు కౌశిక్, పాషా, హోటల్లో పని చేసే మోహన్ అనే వ్యక్తి నలుగురు కలిసి పథకం ప్రకారం మోహన్ కుమార్​ను హత్య చేశారు. శవాన్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడకశిర ప్రాంతం తీసుకొచ్చి హంద్రీనీవా కెనాల్ పక్కన, తమ ఇంటికి ఉన్న డోర్ కర్టన్​తో చుట్టేసి పడేశారు. మృతుడి తల్లి కర్ణాటకలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో మడకశిర పోలీసుల విచారణలో భాగంగా వివరాలు తేలిశాయి. తీగ లాగితే డొంగ కదిలినట్లుగా హత్య వివరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. కవితను అనుమానించిన పోలీసులు ఆమె ఇంటిని వెళ్లారు. పోలీసుల పరిశీలనలో మృతుడికి చుట్టిన డోర్ కర్టన్, కవిత గృహంలోని డోర్ కర్టెన్లు ఒకేలా ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తామని డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు.

కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా బయటపడ్డ యోగా టీచర్- చనిపోయినట్లు నటించి!

తండ్రిని నరికి చంపిన కొడుకు - ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్​

Last Updated : Nov 10, 2024, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.