ETV Bharat / state

కూల్​డ్రింక్​లో చీమల మందు కలుపుకొని తాగిన చిన్నారులు..బాలుడు మృతి

పాపం పసివాళ్లు.. ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థంకాదు.. ఏది తినొచ్చో.. ఏది తినకూడదో తెలియదు. చేతికి దొరికింది నోట్లో పెట్టుకుంటారు. అందుకే పిల్లలున్న ఇంట్లో తల్లిదండ్రులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటారు. వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆ తల్లీ అప్పటివరకూ అలానే చూసుకుంది. అయితే ఎప్పుడు కన్నంటిందో తెలియదు. నిద్రలోకి జారుకుంది. లేచి చూసేసరికి జరగాల్సింది జరిగిపోయింది. పసివాళ్లు తెలియక కూల్ డ్రింకులో చీమల మందు కలుపుకుని తాగేశారు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడా తల్లిదండ్రుల వేదన చూపరులనూ కంటతడి పెట్టిస్తోంది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తవలసలో జరిగింది.

two children drunk ant drug one died another is in critical condition in kottavalasa srikakulam district
చీమల మందు తాగిన చిన్నారులు
author img

By

Published : Jul 1, 2020, 11:17 AM IST

ఇద్దరు పసివాళ్లు.. తెలియనితనం కారణంగా ఒకరు మృతిచెందగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. శీతల పానీయంలో చీమల మందు కలుపుకుని తాగిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు చనిపోగా.. ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తవలసకు చెందిన విశ్వనాథ నాయుడు, పద్మావతి దంపతులకు ఇద్దరు సంతానం. బాబు దేవేంద్ర కుమార్​కు 5 ఏళ్లు, పాప హేమశ్రీకు 3 సంవత్సరాలు. మంగళవారం మధ్యాహ్నం తల్లి నిద్రిస్తుండగా పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారు. వారికి చిల్లర డబ్బులు కనిపించాయి. బయటకు వెళ్లి వాటితో శీతల పానీయం కొని తెచ్చుకున్నారు. తెలిసీ తెలియక ఇంట్లో ఉన్న చీమల మందును అందులో కలుపుకుని తాగారు. కాసేపటి తర్వాత తల్లిని లేపి కడుపులో నొప్పిగా ఉందని చెప్పారు.

ఇంట్లో పరిస్థితిని గమనించిన ఆమె విషయం అర్థం చేసుకుంది. వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. చిన్నారులను రాజాం కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే పిల్లలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించగా చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.

ఇవీ చదవండి...

పాప కిడ్నాప్.. 5 గంటల్లో తల్లిదండ్రుల ఒడికి చేర్చిన పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.