రాష్ట్రాలు దాటి వచ్చినా.. వలస కూలీలకు ఇబ్బందులు తప్పంటలేదు. అధికారులు స్పందించక.. ఒకవేళ స్పందించినా సరైన రీతిలో వసతులు చేకూర్చలేకపోవటం వంటి కారణాలతో.. పునరావస కేంద్రాలలో తల దాచుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు.
ఒక వలస కూలీ గాథ
శ్రీకాకుళానికి కర్నూలు నుంచి వచ్చిన కిమిడి కృష్ణ.. వీరఘట్టం మండల కేంద్రంలోని పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ అధికారులు మేజర్ పంచాయతీకి వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లాడు. మేజర్ పంచాయతీ అధికారులు తమ పరిధిలో పునరావాస కేంద్రం లేదని చెప్పగా.. తిరిగి తాసిల్దార్ కార్యాలయం చేరుకొని పునరావాసం కల్పించాలని కోరాడు. ఎట్టకేలకు అధికారులు వీరఘట్టంలోని కూరాకుల వీధిలోని ఆదర్శ పాఠశాలకు చేర్చారు.
అధికారులు దయ తలచిన స్థానికులు ఒప్పుకోవటంలేదు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని తన పక్కనే ఉన్న పాఠశాలలో ఉంచడంతో పక్కనే నివాసముంటున్న పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు నిరసన తెలిపి బైఠాయించారు. దీంతో అధికారులు వలస కూలిని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రానికి చేర్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తంతు సాగింది.
ఇదీ చదవండి: