ఎంతకష్టమైనా ఇంటికి చేరాలనుకున్నారు. కానీ.. ఆకస్మాత్తుగా తిరిగిరాని లోకాలకు చేరారు ఆ ముగ్గురు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు వలస కూలీలు వేర్వేరు ఘటనల్లో మృత్యువాతపడి.. కుటుంబీకులకు తీరని విషాదాన్ని మిగిల్చారు.
వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటకు చెందిన గుర్జ మల్లేష్ తీవ్ర జ్వరంతో 4 రోజులుగా బాధపడుతూ ముంబయిలో మృతి చెందారు. సోంపేట మండలం కత్తలిపాలెం చెందిన రాజారాం అనే వలస కూలీ కాసేపట్లో గ్రామానికి చేరుకుంటాననే ఆనందంలోనే.. అకస్మాత్తుగా కుప్పకూలారు. రాజమహేంద్రవరం నుంచి లారీమీద వచ్చిన వలసకూలీ రాజారాం.. సొంత గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్ర గ్రామానికి చెందిన మోహనరావు.. ఉపాధి కోసం తిరుపతి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లారీ కోసం వేచి ఉన్న మోహనరావు.. కల్వర్టుపై నిద్ర పోయి.. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
ఇదీ చూడండి: