శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావటంతో కార్యాలయాల వద్ద గుంపులుగా దరఖాస్తుదారులు ఉంటున్నారు. గత ఐదు రోజుల్లో 43 వేల మందికిపైగా కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు జిల్లాలో గడచిన వారం రోజులుగా సర్వర్ మొరాయిస్తోంది. దీనివల్ల వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తులు చేస్తుండటంతో సర్వర్ మొరాయిస్తోందని పలువురు తహసీల్దార్లు పేర్కొంటున్నారు. విజయవాడలోని సర్వర్తో ఇబ్బందులున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సర్వర్ సామర్థ్యం పెంచగలిగితేనే కుల ధ్రువీకరణ పత్రాల జారీలో వేగం పెరుగుతుందని పలువురు చెబుతున్నారు. మరోవైపు గడువు ముగిస్తే పథకం లబ్ధి పొందలేమని అర్హులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి