శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయం వెనుక భాగం గుండా ప్రవేశించిన ఆగంతకులు 5 కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డిటి నాగేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు. పాతపట్నం సీఐ చంద్రశేఖర్, సీతంపేట ఎస్ఐ హైమావతిలు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు.
ఇవీ చదవండి: ఆశీలు అధికంగా వసూలు చేస్తున్నాంటూ సంఘ సభ్యులు ఆందోళన