శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మురపాక, పి.బి.నగర్ కాలనీ, చిన్న మురపాక గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, వసతి గృహాలను పునరావాస కేంద్రాలుగా ఎంపిక చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్న మురపాక వసతి గృహాన్ని పరిశీలించడానికి వెళ్లిన తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తహసీల్దార్ ప్రసాద్ వివరించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇదీచదవండి.