శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ఉజ్వల భవిత ఏర్పడుతుందని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో .. సాగునీటి ప్రాజెక్టుల మంజూరు వివరాలను వివరించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో పొందూరు, ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని సీతారాం తెలిపారు. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు ఇప్పుడు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ.. ఏడు పథకాలను మంజూరు చేయడానికి చర్యలు చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సరికొత్త ఆలోచన