ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో 10పాయింట్లు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరామ్ హజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వన్ యంగ్ ఇండియా సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయని డీఈవో తెలిపారు. అమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఆమదాలవలస ప్రముఖ వైద్యులు డాక్టర్ తాతయ్య ప్రతి విద్యార్థికి గోల్డ్ బహుమతితోపాటు, నగదు అందించారు.
ఇది కూడా చదవండి... "కాపు కార్పొరేషన్"కు... అప్పలనాయుడు రాజీనామా