కరోనాతో బాధపడుతున్న గర్భిణికి.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి 108 సిబ్బంది పురుడు పోసి మానవత్వం చాటారు. మడపాం టోల్ గేట్ సమీపంలో.. వాహనంలోని సిబ్బందే ఆమెకు పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు హేమలత జన్మనిచ్చింది. తల్లీబిడ్డను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 'స్టెరాయిడ్ల దుర్వినియోగమే.. బ్లాక్ ఫంగస్‌కు కారణం'
సారవకోట మండలం పెద్దలంబకు చెందిన హేమలత అనే 9 నెలల గర్భిణి.. పురిటినొప్పులతో టెక్కలి జిల్లా ఆసుపత్రికి కాన్పు కోసం వచ్చింది. కొవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన వైద్య సిబ్బంది.. శ్రీకాకుళం వెళ్లాలని సూచించారు. 108లో ఆమెను శ్రీకాకుళం తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. మానవత్వంతో వ్యవహరించి పురుడుపోసిన 108 సిబ్బంది రాజగోపాల్, రాజేష్ కుమార్‌ను అందరూ అభినందించారు. గర్భిణి కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: