ప్రజావేదిక సభలో వైకాపా, తెదేపా వర్గీయుల బాహాబాహీ - tdp ycp fight
శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ సామాజిక తనిఖీల సమావేశంలో వైకాపా, తెదేపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. సామాజిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో ఇరువర్గాలు కుర్చీలతో దాడి చేసుకున్నారు. డ్వామా పీడీ కూర్మనాథ్ కరకవలస పంచాయతీ కుసుమలపాడు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పనులపై వివరిస్తుండగా వైకాపా, తెదేపా వర్గీయులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
AP_SKLM_03_02_KOTLATA_AV_AP10172
FROM: CH.ESWARA RAO, SRIKAKULAM.
DEC 02
----------------------------------------------------------------------
Note:- Visuals in desk What's App.
------------------------------------------
యాంకర్:- శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ సామాజిక తనిఖీల సమావేశంలో వైకాపా, తెదేపా వర్గీయులు బాహాబాహీకి దిగారు. సామాజిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో ఇరువర్గాలు కుర్చీలతో దాడి చేసుకున్నారు. కరకవలస పంచాయతీ కుసుమలపాడు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పనులపై డ్వామా పీడీ కూర్మనాధ్ వివరిస్తుండగా వైకాపా, తెదేపా వర్గీయులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఐదుగురుకు గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రి తరలించి.. చికిత్స అందిస్తున్నారు...(Vis).