ETV Bharat / state

అగురు కులస్థులకు అండగా తెదేపా: రామ్మోహన్ నాయుడు - ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజా వార్తలు

ఉత్తరాంధ్రలోని అగురు కులస్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... ఆ వర్గ సేవాసంఘం ప్రతినిధులు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. వారికి తెదేపా అండగా ఉంటుందని ఎంపీ తెలిపారు.

tdp will support arugu cast people says  mp rammohan naidu
అరుగు కులస్థులకు తెదేపా అండగా ఉంటుంది: రామ్మోహన్ నాయుడు
author img

By

Published : Nov 22, 2020, 7:22 AM IST

ఉత్తరాంధ్రలోని అగురు కులస్థుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం ఎంపీ కార్యాలయంలో... అగురు కుల సేవాసంఘం ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ వర్గాన్ని బీసీ-డి నుంచి బీసీ-బి గ్రూపులోకి మార్చేందుకు కృషి చేయాలని ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించేలా చూడాలని అభ్యర్థించారు. వారి సమస్యల పరిష్కారానికి తెదేపా అండగా ఉంటుందని రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇల్లు: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.