ETV Bharat / state

రానున్న ఎన్నికల్లో 155 స్థానాల్లో తెదేపా పాగా: అచ్చెన్నాయుడు - achennaidu fires on ysrcp government

పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరల పెరుగుదలపై తెలుగుదేశం శ్రేణులు శ్రీకాకుళం జిల్లాలో నిరసనలు చేపట్టాయి. శ్రీకాకుళం కోటబొమ్మాళి మార్కెట్​ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మెహన్​ నాయుడు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్​పై దేశంలోనే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న ప్రభుత్వం వైకాపా అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp protest at srikakulam district against petrol price hike

author img

By

Published : Aug 28, 2021, 6:27 PM IST

తెదేపై నిరసన

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 155 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల పెంపుదలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మార్కెట్ వద్ద ఎంపీ రామ్మోహన్​ నాయుడుతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పెట్రోలు, డీజీలు , గ్యాస్, నిత్యవసర ధరలు బెంబేలెత్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్​పై దేశంలోనే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న ప్రభుత్వం వైకాపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మందును సీఎం జగన్ గోదాముల్లో తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఆది తాగితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రెండున్నరేళ్లుగా అవినీతే పనిగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారని ఎంపీ రామ్మోహన్​ నాయుడు అన్నారు. మద్యం తయారీ, ఇసుక, మైనింగ్.. ఇలా ప్రతిదానిపై'జె' ట్యాక్స్ వేసుకుని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

Yanamala: అప్పుల ఊబిలో రాష్ట్రం.. అలా చేస్తేనే గట్టెక్కేది!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.