అనుభవం లేక ముఖ్యమంత్రి జగన్ సంపద సృష్టించలేకపోతున్నారని తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాస తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో ఉన్న సంక్షేమ పథకాలనే నవరత్నాల పేరుతో మార్చారని అన్నారు.
ప్రజా సమస్యలపై వైకాపా దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పలాస నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.
ఇదీచదవండి.