దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ అమరుడైన వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ రాలేదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ బోర్డర్ సమీపంలోని కార్గిల్ ప్రాంతంలో ఈనెల 18వ తేదీన బాంబులు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో.. ప్రమాదం శాత్తు ఓ బాంబు పేలిపోవడంతో లావేటి ఉమామహేశ్వరరావు వీర మరణం పొందారు. శ్రీకాకుళం హడ్కోకాలనీకి చెందిన ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యులను అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఎంపీ పేర్కొన్నారు. అశువులు బాసిన ఉమామహేశ్వరరావు ఇద్దరు పిల్లలకు చెరో 25 వేల రూపాయలు చదువు కోసం డిపాజిట్ చేస్తానని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి