బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటుపరం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సమ్మెకు మద్దతు కోరుతూ ..బ్యాంక్ యూనియన్ యునైటెడ్ ఫోరమ్ ప్రతినిధులు ఎంపీని శ్రీకాకుళంలో కలిశారు.
పార్లమెంట్‌లో ఈ అంశంపై గళం విప్పాలని కోరారు. వారి సమస్యలు విన్న ఎంపీ.. తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రం తీరు చూస్తే ప్రతీది ప్రైవేటీకరణ చేసేలా ఉందని రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు.
ఇదీ చదవండి: