శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయంతో పాటు ఏడు రోడ్ల కూడలిలో నిర్వహించిన కార్యక్రమాలకు.. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవి, తెదేపా జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు వారి అత్మగౌరవాన్ని కాపాడిన మహానుభావుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించే వరకు పోరాడతామని చెప్పారు.
వైకాపా ప్రభుత్వం.. రాష్ట్రాన్ని నేలమట్టం చేయాలనే అలోచనతో ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసి.. ప్రత్యేక హోదాను పాతాళానికి తొక్కేశారని మండిపడ్డారు. వైకాపా పాలనతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని తెదేపా నేత కూన రవికుమార్ అన్నారు.
ఆముదాలవలసలో ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్... ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. యువత రక్తదానం చేశారు.
నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి... ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చూడండి: