వాలంటీర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కూన రవి కుమార్ పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు చెప్పారని.. ఫిర్యాదుదారుడు పోలీసుస్టేషన్‌కు రాకముందే పోలీసులు బాధితులపై విరుచుకుపడుతున్నారని కూన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితుడిపై సీఐ వేణుగోపాల్ ప్రవర్తించిన తీరు దారణమన్నారు. కాశీబుగ్గ ఘటనకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు వాలంటీర్ పైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కూన రవికుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాజధానిలో పెట్టింది ప్రజల సొమ్ము.. ఖజానాకు నష్టం కదా..: హైకోర్టు