ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​పై నుంచి దూకిన మాజీ సర్పంచ్ - ఎచ్చెర్లలో పోలీష్​ స్టేషన్​ పైనుంచి దూకిన వ్యక్తి

ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదంతో మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్​... పోలీస్‌ స్టేషన్‌ భవనంపై నుంచి దూకిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తెదేపా నేత అచ్చెన్నాయుడు పరామర్శించారు. పోలీసుల వేధింపులే ఈ ఘటనకు కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన అచ్చెంనాయుడు

author img

By

Published : Mar 6, 2020, 8:33 PM IST

పోలీస్​ స్టేషన్​పై నుంచి దూకిన మాజీ సర్పంచ్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఇరువర్గాల మధ్య వివాదం కారణంగా ఓ మాజీ సర్పంచ్​ మనస్తాపంతో ఏకంగా పోలీస్​ స్టేషన్​పై నుంచే దూకాడు. షేర్‌ మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ వివాదం పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ సర్పంచ్​ అవినాష్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనంపై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన అవినాష్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుణ్ని తెదేపా నేత అచ్చెన్నాయుడు పరామర్శించారు. పోలీసుల వేధింపులే ఘటనకు కారణమని అవినాష్​ తల్లిదండ్రులు ఆరోపించారు.

ఇదీ చూడండి:

ఇంటి ముందు దుర్భాషలాడారని మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.