విద్యార్థి కిడ్నాప్ శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఒక్కసారిగా కలకలం రేపింది. పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో చదువుతున్న అభిలాష్ అనే ఆరో తరగతి విద్యార్థిని గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వ్యానులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. బాలుడు కేకలు వేయటంతో సుమారు 3 కిలోమీటర్ల దూరం సమీపంలో విడిచిపెట్టి పరారయ్యారు. అయితే అపహరణకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: