శ్రీకాకుళం జిల్లా తెట్టంగి, నీలానగరం, పనస, నందివాడ గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 100 లీటర్ల సారా, 250 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. 3,200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎస్ఈబీ ఏఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఆయా గ్రామాల్లోని అనుమానిత గృహాలతో పాటు బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నాటు సారా తయారు చేసినా.. విక్రయించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయ అధికారులతో ఆయన మాట్లాడారు. సారా విక్రయాలపై తమకు సమాచారం అందించాలని సూచించారు.
ఇదీ చదవండి: 26న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు