ETV Bharat / state

బాబాయ్... అబ్బాయ్‌... అమ్మాయి... - ycp

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జగన్ ప్రభంజనం సృష్టించారు. వైకాపా సునామీలో ఎందరో హెమాహేమీల అడ్రస్ గల్లంతైంది. దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు కుటుంబం మాత్రం ఫ్యాను హవా తట్టుకొని నిలబడింది. రాష్ట్రవ్యాప్తంగా తెదేపాకు ఎదురుగాలి వీచినా... శ్రీకాకుళం పార్లమెంటు, టెక్కలి అసెంబ్లీ, రాజమహేంద్రవరం పట్టణ అసెంబ్లీ స్థానాల్లో ఎర్రన్నాయుడి కుటుంబీకులు ఫ్యాను స్పీడుకు బ్రేకులు వేశారు.

కుటుంబ విజయం
author img

By

Published : May 25, 2019, 7:02 AM IST

Updated : May 25, 2019, 1:32 PM IST

కుటుంబ విజయం

రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి ప్రభంజనంలా వీచింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా అసాధారణ విజయం సొంతం చేసుకుంది. ఏకంగా 150కిపైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుంది. వైకాపా ప్రభంజనంలో దశాబ్దాల అనుభవం ఉన్న నేతలు పరాజయం పొందారు. ఎందరో ప్రముఖులు ఆధిక్యం... అనే మాట వినలేదు. కానీ దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు మాత్రం ఫ్యాను గాలికి ఎదురొడ్డి నిలిచారు.
శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో ఎర్రన్నాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు తెదేపా తరఫున పోటీచేశారు. హోరాహోరి పోరులో విజయం సాధించారు. ఇక ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఉత్కంఠ పోరులో వైకాపా జోరుకు అడ్డుకట్ట వేసి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా జగన్ సునామీ సృష్టించగా... రాజమహేంద్రవరం పట్టణ అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా తరఫున పోటీచేసిన ఎర్రన్నాయుడి కుమార్తె, రామ్మోహన్​నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని 30వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెదేపాలో కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు పరాజయం పొందినా ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులు గెలుపొందడంపై పార్టీ కార్యకర్తలు, కింజారపు అభిమానులు అనందం వ్యక్తం చేస్తున్నారు.

ap_atp_57_24_police_station_yeduta_darna_av_c10 Date:24-05-2019 Center:penu konda Contributor:c.a.naresh Cell:9100020922 పోలస్ స్టేషన్ ఎదుట దర్న అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు టపాసులు కాల్చటంతో కియా ఇండస్ట్రీయల్ ఏరియా పోలీసు స్టేషన్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి స్టషన్ తరలించారు. ఆగ్రహించిన గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ ఎదుట బైటాయించారు...
Last Updated : May 25, 2019, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.