శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని సంగమేశ్వర ఆలయం నీటమునిగింది. సువర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి మడ్డువలస జలాశయానికి వరద నీరు పోటెత్తింది. మడ్డువలస నిర్వాసిత గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 9 గేట్ల ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేశారు అధికారులు. ఒక్కసారిగా పెరిగిన ఈ వరదతో సంగమేశ్వర ఆలయంలోకి నీరు చేరింది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టినందున మడ్డువలస ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు.
వంగర సంగమేశ్వరాలయాన్ని ముంచెత్తిన గంగమ్మ - srikakulam rain news
వరద ప్రవాహానికి శ్రీకాకుళం జిల్లాలోని వంగరలో సంగమేశ్వరాలయం నీట మునిగింది. నాగావళి నదిలోకి ఒక్కసారిగా నీటి విడుదల చేయడం వల్లే ఈ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.