ETV Bharat / state

'సైబర్ మోసాలు, ఆన్లైన్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి'

బ్యాంకు వివరాలను ఫోన్​లో ఎవరైనా అడిగితే చెప్పొద్దని.. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్​ బార్దార్ ప్రజలకు సూచించారు. సైబర్ మోసాలపై, ఆన్లైన్ లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సైబర్ మోసాలు, ఆన్లైన్ లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

author img

By

Published : Nov 17, 2020, 9:42 PM IST

సైబర్ మోసాలపై, ఆన్లైన్ లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అమిత్​ బార్దార్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అవేర్‌నెస్ వీక్-2020ని పురస్కరించుకొని ' మూహ్ బంద్ రఖో ' పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రస్తుత కాలంలో స్మార్ట్​ఫోన్ ప్రతి వ్యక్తికి నిత్యావసర వస్తువుగా మారిందని.. ఉపయోగం ఎంత ఉందో, హాని కూడా అంతే ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా బ్యాంకు, వ్యాపార ఆన్​లైన్ షాపింగులు సులభంగా అవుతున్నాయన్నారు. ఈ విధమైన లావాదేవీలు జరిపేటప్పుడు ప్రజలు చాలా అప్రమమత్తంగా ఉండాలన్నారు.

బ్యాంకు వివరాలను ఫోన్​లో ఎవరైనా అడిగితే చెప్పొద్దని..,అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. అనుకోకుండా ఎవరైనా ఆర్థిక మోసాల బాధితులుగా మారితే తక్షణమే స్థానిక బ్యాంకు అధికారులకు లేదా ఆన్​లైన్ సైబర్ క్రైమ్ జీఓవీ.ఇన్​ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:

ఆన్​లైన్​లో తప్పుడు సమాచారం .. పలు పాఠశాలల్లో పోస్టులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.